CPM Leader: కేరళలో సీపీఎం నేత దారుణ హత్య.. పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
కోజికోడ్‌లోని కోయిలాండిలో కేరళలోని అధికార సీపీఎం స్థానిక నాయకుడు గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు.హత్యానంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వ్యక్తిగత శత్రుత్వమే ఈ నేరానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు సీపీఎం కోయిలాండి పట్టణ స్థానిక కమిటీ కార్యదర్శి పీవీ సత్యనాథన్‌గా గుర్తించారు. ఆయన వయసు 66. అభిలాష్ (33)గా గుర్తించిన నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
స్పాట్ నుండి పరారైన అభిలాష్
ఆలయ ఉత్సవాల్లో సంగీత కచేరీ చూస్తున్న సత్యనాథన్‌ను అభిలాష్ పదునైన ఆయుధంతో నరికి చంపాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలతో సత్యనాథన్ చనిపోయాడు. ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలను కాపాడలేకపోయారని పోలీసులు తెలిపారు. మొదట స్పాట్ నుండి పరారైన అభిలాష్ అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు. స్థానిక సమాచారం ప్రకారం అభిలాష్ గతంలో సీపీఎం కార్యకర్త. హత్యకు నిరసనగా సిపిఎం కోయిలాండి ప్రాంతంలో తెల్లవారుజామున హర్తాళ్ (సమ్మె) పాటిస్తోంది.