UP: మౌని అమావాస్య వేళ ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ.. 1.3 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్నానాలు
ఈ వార్తాకథనం ఏంటి
మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ (UP)లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌తో పాటు పరిసర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో భక్తుల రద్దీ ప్రారంభమైంది. అధికారుల వివరాల ప్రకారం, ఒక్కరోజే 1.3 కోట్లకు పైగా భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. మాఘమేళా పవిత్ర స్నానాల కోసం మొత్తం 12,100 అడుగుల పొడవైన స్నానపు ఘాట్‌లను నిర్మించినట్లు అధికారులు తెలిపారు.
Details
పోలీసులకు సహకరించాలి
భక్తులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. భద్రత పరంగా సాధారణ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉన్నారని, ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే సహాయం అందించేందుకు వైద్య నిపుణుల బృందాలను కూడా మోహరించినట్లు తెలిపారు. భక్తులు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ, అధికారులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.