తదుపరి వార్తా కథనం

CV Anand: హైదరాబాద్ సీపీగా మళ్లీ సీవీ ఆనంద్ నియామకం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 07, 2024
05:42 pm
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సీవీ ఆనంద్ గత ఏడాది వరకూ హైదరాబాద్ సీపీగా సేవలందించిన విషయం తెలిసిందే.
1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ 2021 డిసెంబరు నుండి 2023 అక్టోబరు వరకు హైదరాబాద్ సీపీగా సేవలందించారు.
తెలంగాణ కేడర్‌కు చెందిన ఆయన 2017లో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పదోన్నతిని పొందారు.
తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లి 2021లో తిరిగి తెలంగాణకు వచ్చారు. 2023 ఆగస్టులో ఆయనకు డీజీపీ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.