Loading...
Cyclone Arnab: ఏపీ వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్ .. 140కి.మీ. వేగంతో ఈదురుగాలులు.. 28న తీరం దాటే అవకాశం..!
28న తీరం దాటే అవకాశం..!

Cyclone Arnab: ఏపీ వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్ .. 140కి.మీ. వేగంతో ఈదురుగాలులు.. 28న తీరం దాటే అవకాశం..!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 26, 2026
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరంవైపు వేగంగా కదులుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాన్ గత ఆరు గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా పయనించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. ఇది మరింత బలపడి అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని, అక్టోబర్ 28 నాటికి ఏపీ తీరాన్ని తాకవచ్చని అంచనా వేసింది.

వివరాలు 

అక్టోబర్ 28న తీరం దాటే అవకాశం

వాతావరణ శాఖ అంచనా ప్రకారం అక్టోబర్ 28 ఉదయానికి అర్నబ్ తుఫాన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా చేరుకోనుంది.

అదే రోజు మధ్యాహ్నంలోగా బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య ప్రాంతంలో, యానాం తీరాన్ని కలుపుకుని, అతి తీవ్ర తుఫాన్‌గా తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ భువనేశ్వర్ కేంద్రం తెలిపింది.

తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

కొన్ని సందర్భాల్లో గాలుల వేగం గంటకు 140 కిలోమీటర్ల వరకు చేరవచ్చని పేర్కొన్నారు. దీంతో తీరప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.

వివరాలు 

పలు ప్రాంతాలకు సమీపంలో తుఫాన్ కేంద్రీకృతం

అక్టోబర్ 25 రాత్రి 11 గంటలకు అందిన సమాచారం ప్రకారం తీవ్ర వాయుగుండం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలింది.

అదే రోజు రాత్రి 11.30 గంటల సమయానికి శ్రీ విజయ పురానికి (అండమాన్ దీవులు) ఉత్తర-వాయువ్యంగా 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అలాగే విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 730 కిలోమీటర్లు, కాకినాడకు తూర్పు-ఆగ్నేయంగా 820 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 920 కిలోమీటర్లు, బాపట్లకు తూర్పుగా 990 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

మంగళవారం నాటికి మరింత తీవ్రత

తుఫాన్ తొలుత గంటకు 75 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నప్పటికీ, అక్టోబర్ 27 నాటికి గాలుల వేగం గంటకు 100 నుంచి 125 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈ క్రమంలోనే ఇది అతి తీవ్ర తుఫాన్‌గా మారవచ్చని హెచ్చరించింది.

అనంతరం ఉత్తర దిశగా కదులుతున్న సమయంలో గాలుల వేగం కొంత తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం

అర్నబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగమంతా పూర్తి సన్నద్ధతతో ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో ముందస్తు ప్రణాళికలు రూపొందించి, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

తుఫాన్ వల్ల కలిగే ముప్పును తగ్గించేందుకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

తమిళనాడు మత్స్యకారులకు ఆంక్షలు

తుఫాన్ ప్రభావం నేపథ్యంలో తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో అధికారులు మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. దీంతో యాంత్రిక పడవలపై వేటకు వెళ్లే మత్స్యకారులు తీరంలోనే ఉండిపోయారు.

వివరాలు 

ఒడిశాలోనూ ముందస్తు చర్యలు

అర్నబ్ తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఒడిశా ప్రభుత్వం కూడా సన్నాహాలు ముమ్మరం చేసింది.

తుఫాన్ ముప్పును ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు.

తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా వివిధ ప్రభుత్వ శాఖలకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు.

ADVERTISEMENT