Page Loader
బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్: గుజరాత్ తీరంలో రెడ్ అలర్ట్ జారీ 
బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్: గుజరాత్ తీరంలో రెడ్ అలర్ట్ జారీ

బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్: గుజరాత్ తీరంలో రెడ్ అలర్ట్ జారీ 

వ్రాసిన వారు Stalin
Jun 15, 2023
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

బిపోర్‌జాయ్ తుపాను గురువారం గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవు సమీపంలో తీరాన్ని తాకనుంది. ఈ సమయంలో రాష్ట్రంలోని కోస్తా జిల్లాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. తుపాను తీరం దాటే క్రమంలో గంటకు 145 కి.మీ వేగంతో వీస్తాయని ఐఎండీ చెప్పింది. దీంతో సౌరాష్ట్ర, కచ్ తీరాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు, బలమైన గాలులు రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో రోడ్లు, పంటలు, ఇళ్లకు నష్టం కలిగించి రైల్వే సేవలకు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. అలాగే విద్యుత్ స్తంభాలు నెలకూలి కరెంట్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

ఐఎండీ

74,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

తుఫాను గురువారం సాయంత్రానికి ఈశాన్య దిశగా కదులుతూ అత్యంత తీవ్రంగా మారనున్నట్లు ఐఎండీ చెప్పింది. సౌరాష్ట్ర, కచ్ తీరాల వెంబడి సముద్రం పరిస్థితి జూన్ 15రాత్రి వరకు అసాధారణంగా ఉంటుందని, ఆ తర్వాత మెరుగుపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కచ్ఛ్, దేవభూమి ద్వారక, పోర్‌బందర్, జామ్‌నగర్, మోర్బీ జిల్లాల్లో తుపాను ఉప్పెన గురించి వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా మరికొన్ని రైళ్లను రద్దు చేయాలని పశ్చిమ రైల్వే(డబ్ల్యూఆర్) బుధవారం నిర్ణయించింది. ఇప్పటి వరకు మొత్తం 76రైళ్లు రద్దు చేశారు. 74,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో తీరప్రాంతాల్లోని తరలింపు ప్రక్రియ బుధవారం ఉదయం నాటికి పూర్తయిందని గుజరాత్ సహాయ కమిషనర్ అలోక్ పాండే తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంబై బీచ్‌లో ఎగిసిపడుతున్న అలలు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గుజరాత్‌లో గంభీరంగా సముద్రం