Loading...
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు రెడ్‌ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు రెడ్‌ అలర్ట్

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు రెడ్‌ అలర్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2026
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది బుధవారం రాత్రి ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిశా తీరంలో విశాఖపట్నం, గోపాల్‌పూర్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

వివరాలు 

భారీ వర్షాలకు అవకాశం

తీవ్ర వాయుగుండం ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

బుధ, గురువారాల్లో మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉండటంతో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

శ్రీకాకుళంలో ఎడతెరపి లేని వర్షం

శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి వర్షం ఆగకుండా కురుస్తోంది. రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి.

వివరాలు 

శ్రీకాకుళంలో ఎడతెరపి లేని వర్షం

మంగళవారం ఉదయం 8.30 నుంచి 9 గంటల మధ్య నమోదైన వర్షపాత వివరాలను పరిశీలిస్తే.. శ్రీకాకుళం జిల్లా పలాసలో అత్యధికంగా 100.75 మి.మీ. వర్షపాతం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా గంపరాయిలో 73.0 మి.మీ., విశాఖపట్నం జిల్లా మధురవాడలో 69.5 మి.మీ., నంద్యాల జిల్లా కనాలలో 65.91 మి.మీ., విజయనగరం జిల్లా భోగాపురంలో 62.9 మి.మీ., అనకాపల్లి జిల్లా పరవాడలో 60.0 మి.మీ. వర్షపాతం నమోదైంది.

సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు నంద్యాల జిల్లా పాములపాడులో 98.75 మి.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా విజయరామపురంలో 90.5 మి.మీ., చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో 88.5 మి.మీ., పల్నాడు జిల్లా గండివేములలో 78.81 మి.మీ. వర్షపాతం నమోదైంది.

ADVERTISEMENT

వివరాలు 

కాలువలో యువకుడు గల్లంతు

పార్వతీపురం మన్యం జిల్లా ఏగోటివలసలోని తోటపల్లి కాలువలో స్నానానికి వెళ్లిన హేమంత్‌కృష్ణ (39) అనే యువకుడు గల్లంతయ్యాడు. భారీ వర్షాల నేపథ్యంలో కాలువలు, వాగులు, చెరువుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. బుధవారం ఒడిశాలోని 9 జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో అనకాపల్లి,విజయనగరం, విశాఖపట్నం,శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పశ్చిమగోదావరి,కోనసీమ,ఎన్టీఆర్,కృష్ణా,గుంటూరు జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.

ADVERTISEMENT

వివరాలు 

పాఠశాలలకు సెలవు

అతిభారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

వివరాలు 

అధికారులను అప్రమత్తం చేసిన మంత్రులు

ఉత్తర కోస్తాలో భారీ వర్షాలకు అవకాశం ఉన్నందున జలవనరులశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు.

మంగళవారం ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు.

తీవ్ర వాయుగుండం పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం కుంచనపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధికారులతో ఆమె సమావేశమయ్యారు.

వివరాలు 

రైతుల కోసం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్

వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడిని ఉపగ్రహ ఆధారంగా గుర్తించి రైతులకు అవసరమైన సూచనలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

కృష్ణా జిల్లా గన్నవరంలోని సమీకృత కాల్‌ సెంటర్‌లో ఎల్‌నినో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

ఉపగ్రహ సమాచారం ఆధారంగా పరిస్థితులను గుర్తించి రైతులకు తగిన సూచనలు అందించడమే దీని ఉద్దేశం.

ADVERTISEMENT