LOADING...
Cyclone Montha: ఏపీలో 18లక్షల మందిపై ప్రభావం చూపించిన మొంథా తుపాను.. 
ఏపీలో 18లక్షల మందిపై ప్రభావం చూపించిన మొంథా తుపాను..

Cyclone Montha: ఏపీలో 18లక్షల మందిపై ప్రభావం చూపించిన మొంథా తుపాను.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

మొంథా తుపాన్‌ కారణంగా జరిగిన నష్టం అంచనా పనులను అధికారులు వేగంగా కొనసాగిస్తున్నారు. ఈ తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రాథమిక నష్టం వివరాలపై సమగ్ర నివేదికను వచ్చే రెండు రోజులలో ప్రభుత్వానికి సమర్పించే అవకాశముందని సమాచారం. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తరువాత కేంద్రానికి నివేదిక పంపనుంది. మొత్తం 249 మండలాలు,48 మున్సిపాలిటీల పరిధిలో దాదాపు 18లక్షల మందికి పైగా తుఫాన్‌ ప్రభావం పడినట్లు అంచనా. అనేక జిల్లాల్లో వరి,ఉద్యాన పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన ఈదురుగాలుల కారణంగా అనేక ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు నేలకూలిపోయాయి. అదనంగా,విద్యుత్‌ సరఫరా వ్యవస్థకు కూడా గణనీయమైన నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు.