Loading...
Andhra Pradesh: ఏపీకి తుపాను ముప్పు.. 110 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు,భారీవర్షాలు
ఏపీకి తుపాను ముప్పు.. 110 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు,భారీవర్షాలు

Andhra Pradesh: ఏపీకి తుపాను ముప్పు.. 110 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు,భారీవర్షాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2026
08:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుపానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శనివారానికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. సోమవారానికి మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా రూపాంతరం చెందవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. అనంతరం ఈ తుపాను ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశముందని తెలిపింది.

వివరాలు 

తుపాను పేరు 'ఆర్నబ్‌'

తుపాను ప్రభావంతో శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు పడొచ్చు. మంగళ, బుధవారాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

తుపాను తీరం దాటే సమయంలో కుండపోత వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ తుపానుకు బంగ్లాదేశ్‌ 'ఆర్నబ్‌' అనే పేరు పెట్టింది. బెంగాలీ భాషలో ఆర్నబ్‌ అంటే సముద్రం అని అర్థం.

వివరాలు 

26 నుంచి తుపాను ప్రభావం తీవ్రం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ నెల 26న తుపానుగా మారే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సంచాలకుడు పీఎల్‌ఎన్‌ మూర్తి తెలిపారు.

ఆ తర్వాత రెండు రోజులకు కాకినాడ-కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు.

తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని వివరించారు.

సముద్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చని, ఈ నెల 25 నుంచి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఈ సీజన్‌లో ఇదే తొలి తుపాను

ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుతం వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఇటీవల ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ ఉక్కపోత, వేడి మాత్రం తగ్గలేదు.

వర్షాకాలంలోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.

ప్రస్తుతం ఏర్పడుతున్న తుపాను కారణంగా వర్షాలు కురిసి వర్షపాతం లోటు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ తుపాను ఈ సీజన్‌లో తొలి తుపానుగా నిలవనుంది.

ADVERTISEMENT