AP Cyclone Dana: దానా తుఫాన్ ఎఫెక్టు.. శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలకు అలర్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం, పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడింది.
ఈ వాయుగుండానికి దానా అనే పేరు పెట్టారు. ఈ వాయుగుండం ఒడిశాలోని పారాదీప్‌కు 730 కిమీ, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి 770 కిమీ, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరాకు 740 కిమీ దూరంలో ఉంది.
సముద్రంలో వాయుగుండం తీవ్రత పెరగడంతో, అక్టోబర్ 23న ఇది తుపానుగా మారే అవకాశం ఉంది.
24వ తేదీకి వాయువ్య దిశగా కదులుతూ, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ సమీపంలో దానా తీరం దాటే అంచనా ఉంది.
Details
భారీ వర్షాలు పడే అవకాశం
ఈ తుఫానుకు సంబంధించిన ప్రభావాలతో అక్టోబర్ 24, 25 తేదీలలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ దానా తుఫాను కారణంగా సముద్రంలో అలజడి నెలకొనడంతో, మత్స్యకారులకు మత్స్య వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తుఫాను నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.
ఈ సమావేశంలో టెలికమ్యూనికేషన్స్, ఫిషరీస్, పవర్, పోర్ట్స్, పెట్రోలియం& నేచురల్ గ్యాస్ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.
Details
ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు
తుపాను హెచ్చరికలపై తీసుకున్న ముందస్తు చర్యలను స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా వివరించారు.
ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయడం, అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచడం వంటి చర్యలు చేపట్టామని తెలిపారు.
తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు.
అత్యవసర వైద్య మందులను, నిత్య అవసర వస్తువులను సమకూర్చి, శానిటేషన్ కోసం అవసరమైన పదార్థాలను సిద్ధంగా ఉంచడం జరిగిందని తెలిపారు.
విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపడతామని స్పష్టం చేశారు