
YS Avinash Reddy bail: ఎంపీ అవినాష్ బెయిల్ పై వాదనలు.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
అప్రూవర్‌గా మారిన నిందితుడు షేక్ దస్తగిరి,ఈ కేసులో మరో నిందితుడు,కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు అనుమతించింది.
ఈ విషయమై స్పందించిన హైకోర్టు..పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.
సీబీఐతో పాటు ఎంపీ అవినాశ్ రెడ్డికి, వివేకా కుమార్తె సునీతారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
ఇటీవల అవినాష్ రెడ్డి అనుచరులు ముగ్గురు తన తండ్రిపై హత్యాయత్నం చేశారన్నారు.
ఈ దాడిలో తన తండ్రి తీవ్రంగా గాయపడ్డారన్నారు.ఇది సాక్ష్యాలను తారుమారు చేయడమేనని ఆయన అన్నారు.
Details
సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే 20 కోట్లు
మరో కేసులో తాను జైలులో ఉన్నప్పుడు వైద్య శిబిరం సాకుతో దేవిరెడ్డి చైతన్య రెడ్డి జైలుకు వచ్చారని దస్తగిరి తెలిపారు.
చైతన్య రెడ్డి మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు.
20 కోట్లతో నేరుగా ఎస్ఎస్ఆర్ వద్దకు వచ్చి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తనను కలిశారన్నారు. సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే తమ కుటుంబాన్ని, పిల్లలను అవినాష్ రెడ్డి, సీఎం జగన్ చూసుకుంటారని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారని చెప్పారు.
ఇక్కడికి తనంతట తానే వచ్చానని అవినాష్ రెడ్డి, సీఎం జగన్, వైఎస్ భారతి రెడ్డిలు తమ పక్కన ఉన్నారని వారి కోసం తాము ఎవర్నయినా ఏం చేయడానికైనా సిద్ధమని చైతన్యరెడ్డి హెచ్చరించినట్లు వెల్లడించారు.