NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కర్ణాటక పోలీస్ స్టేషన్ లో అరుదైన ఘటన.. తండ్రికి బదిలీ కావడంతో కూతురికి ఇంఛార్జ్ బాధ్యతలు
    తదుపరి వార్తా కథనం
    కర్ణాటక పోలీస్ స్టేషన్ లో అరుదైన ఘటన.. తండ్రికి బదిలీ కావడంతో కూతురికి ఇంఛార్జ్ బాధ్యతలు
    తండ్రికి బదిలీ కావడంతో కూతురికి ఇంఛార్జ్ బాధ్యతలు

    కర్ణాటక పోలీస్ స్టేషన్ లో అరుదైన ఘటన.. తండ్రికి బదిలీ కావడంతో కూతురికి ఇంఛార్జ్ బాధ్యతలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 22, 2023
    11:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బదిలీపై వెళ్తున్న ఓ పోలీస్ అధికారి, సదరు పోలీస్ స్టేషన్ బాధ్యతలను తన కూతురికే అప్పగించిన అరుదైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.

    మండ్య సెంట్రల్ స్టేషన్ లో కూతురు వర్ష సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే ఠాణాలో ఆమె తండ్రి వెంకటేశ్‌ ఇన్స్పెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

    అయితే తండ్రి బదిలీపై వెళ్తూ వెళ్తూ సదరు ఇంఛార్జ్ బాధ్యతలను కుమార్తెకు అందించడం విశేషం. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టేషన్ హౌజ్ ఆఫీసరైన తండ్రి నుంచి వర్ష ఛార్జ్ తీసుకున్నారు.

    DETAILS

    కూతురిని చూసి గర్వంగా ఫీలవుతున్నా : తండ్రి వెంకటేశ్

    గతంలో 16 ఏళ్ల పాటు ఆర్మీలో వివిధ హోదాల్లో వెంకటేశ్ సేవలు అందించారు. అనంతరం 2010లో కర్ణాటక పోలీస్ పరీక్షలు రాసి ఎస్సైగా స్టేట్ పోలీస్ సర్వీసులకు ఎంపికయ్యారు.

    అనంతరం 2010 నుంచి 2023 వరకు సుమారు 13 ఏళ్లు వెంకటేశ్ వివిధ ఠాణాల్లో విశేషంగా సేవలు అందించారు.

    తాజాగా గత ఏడాది జరిగిన పోలీస్ నియామకాల్లో సదరు అధికారి కుమార్తె వర్ష ఎస్సైగా ఎంపికయ్యారు. ప్రొబేషనరీ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆమె మండ్య ఠాణాలో ఎస్సైగా బుధవారమే బాధ్యతలు చేపట్టారు.

    ఈ క్రమంలోనే తండ్రి నుంచి కూతురు బాధ్యతలు స్వీకరించారు. కూతురిని చూసి గర్వంగా ఫీలయ్యానని వెంకటేశ్ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఇది తన అదృష్టమని వర్ష తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    Prof S Mahendra Dev: ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్‌గా సూర్యదేవర మహేంద్రదేవ్‌    కేంద్ర ప్రభుత్వం
    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు

    కర్ణాటక

    కాంగ్రెస్ మేనిఫెస్టో: ఉచిత విద్యుత్, రూ.3వేల నిరుద్యోగ భృతి, కుటుంబ పెద్దకు రూ.2వేలు అసెంబ్లీ ఎన్నికలు
    కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌ తప్పిన ప్రమాదం; హెలికాప్టర్ అత్యవసరల ల్యాండింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ చెట్లపై నోట్ల కట్టలు  అసెంబ్లీ ఎన్నికలు
    మతం ఆధారంగా ఓట్లు అడగడం సిగ్గుచేటు : అక్బరుద్దీన్ ఓవైసీ బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025