Page Loader
డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష
డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

వ్రాసిన వారు Stalin
Apr 18, 2023
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంజారాహిల్స్‌ డీఏవీ స్కూల్‌లోని నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో డ్రైవర్ రజనీ కుమార్‌కు హైదరాబాద్ కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. రజనీ కుమార్‌ను దోషిగా నిర్ధారించిన నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మంగళవారం శిక్షను ఖరారు చేసింది. పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై 2022 అక్టోబర్ 17న అప్పటి ప్రిన్సిపాల్ మాధవి రెడ్డి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న రజనీ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ దారుణమైన చర్య వెలుగులోకి వచ్చింది.

డీఏవీ

రజనీ కుమార్‌పై పోక్సో కేసు

వైద్య పరీక్షలో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పాఠశాలల్లో చదవుతున్న ఇతర విద్యార్థుల తల్లి దండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి డ్రైవర్‌ను చితకబాదారు. ఈ వ్యవహారంలో పోలీసులు రజనీ కుమార్‌తో ప్రిన్సిపాల్ మాధవి రెడ్డిని అరెస్టు చేశారు. రజనీ కుమార్‌పై కఠినమైన పోక్సో చట్టంలోని నిబంధనలతో పాటు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 364, 376 (ఎ) (బి) కింద కేసు నమోదు చేయబడింది.