Page Loader
Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు
మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

మావోయిస్టుల నిర్మూలనదిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టుల నుంచి పూర్తిగా స్వేచ్ఛ చేయాలన్నదే లక్ష్యంగా 'ఆపరేషన్‌ కగార్‌'ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌ 2023 నుంచే వేగంగా అమలవుతోంది. ఈ ప్రక్రియలో మావోయిస్టుల ప్రధాన నేతలను భద్రతా బలగాలు ఒకొక్కరిగా మట్టుబెడుతున్నాయి. ఇటీవల మావోయిస్టుల నుంచి ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. కేంద్ర కమిటీ తరఫున అభయ పేరిట విడుదలైన ఈ లేఖలో మే 21న మృతి చెందిన తమ అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఛత్తీస్‌ఘడ్‌లోని అబూజ్‌మడ్‌ అడవులు గతంలో మావోయిస్టులకు బలమైన స్థావరాలుగా ఉన్నప్పటికీ,అక్కడికి భద్రతా బలగాలు అడుగుపెడుతూ తమ దౌత్యాన్ని విస్తరిస్తున్నాయి.

Details

పదుల సంఖ్యలో హతమవుతున్న మావోయిస్టులు

ఆధునిక సాంకేతికతతో మావోయిస్టులను వెదుకుతూ, వరుస ఎన్‌కౌంటర్లు నిర్వహిస్తున్నారు. దాంతో మావోయిస్టులు పదుల సంఖ్యలో హతమవుతుండగా, కొంతమంది జవాన్లు కూడా ప్రాణత్యాగాలు చేస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా అడవుల్లో భద్రతా బలగాలు మే 21న నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు (70) మృతి చెందారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 27 మంది మావోయిస్టులు హతమయ్యారని, వారిలో నంబాల కేశవరావు కూడా ఉన్నట్టు పోలీసులు ధ్రువీకరించారు. అతనిపై రూ.1.5 కోట్లు బహుమతి కూడా ప్రకటించారు.