
వర్షాల జడలేక, ప్రాజక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు
ఈ వార్తాకథనం ఏంటి
జూన్ మూడో వారం గడుస్తున్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల జడలేదు. ఎండలు మండిపోతున్నాయి. దీంతో జలాశయాల్లోని నీరు క్రమంగా అడుగంటిపోతున్న పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా కృష్ణా, గోదవరి పరివాహకాల్లోని ప్రాజెక్టులు నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి.
కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్న ఆలమట్టి, ప్రకాశం బ్యారేజీతో పాటు మొత్తం 8 ప్రాజెక్టుల్లో నీటి నిల్వ బాగా తగ్గిపోయింది. మొత్తం 859.51 టీఎంసీలకు గానూ ప్రస్తుతం ఈ 8 ప్రాజెక్టుల్లో కలిపి కేవలం 272.65 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.
కృష్ణా బేసిన్ పరిధిలోని సింగూరు, ధవళేశ్వరంతో పాటు మొత్తం 8 ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం 220.3 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 88.44 టీఎంసీలు మాత్రమే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
నీరు
వానల కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనా?
గతేడాది జూన్ రెండో వారానికే మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు ప్రారంభమయ్యాయి. కానీ ఈ సారి మూడోవారం నడుస్తున్నా తొలకరి పలకరించలేదు.
కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొన్న పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవానికి ఆలమట్టి కానీ, నారయాణపూర్ జలాశయానికి గానీ 100టీఎంసీలు చేరితేనే, కింద ఉన్న జూరాలకు నీరు విడుదలవుతుంది.
నైరుతి రుతుపవనాలు ఇంకా కర్ణాటకను తాకలేదు. మహారాష్ట్రలో కూడా వాటి ఊసేలేదు. ఈ క్రమంలో వర్షాలు పడి, నదులు, జలాశయాలులు నీటితో నిండిపోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉంటే, నాగార్జునసాగర్ జలాశయంలో నీరు తక్కువగా ఉన్నందున్న అవసరం ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
రివర్స్ పంపింగ్ ద్వారా ఆ నీటిని తిరిగి జలాశయంలోకి ఎత్తిపోస్తున్న పరిస్థితి నెలకొంది.