Deepfake: డీప్‌ఫేక్‌లను పరిష్కరించడానికి నిబంధనలు.. క్రియేటర్స్ కి పెనాల్టీ.. కేంద్రం నిర్ణయం
డీప్‌ఫేక్‌ల గురించి పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం త్వరలో కొత్త చట్టాన్ని తీసుకువస్తుందని లేదా ప్రస్తుత చట్టాలకు సవరణలు చేస్తుందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు. Deepfake వీడియోలు, క్రియేటర్ లకు, ఆ వీడియోలను వ్యాప్తి చేసే సామాజిక మాధ్యమాలకు పెనాల్టీ విధిస్తామని ఆయన తెలిపారు. ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం Social Media సంస్థలు, Nasscom, Artificial Intelligenceపై పనిచేసే నిపుణులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటి మంత్రి మాట్లాడుతూ డీప్‌ఫేక్‌లు ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పుగా మారాయన్నారు.ఇవి సమాజం, దాని సంస్థలపై విశ్వాసాన్ని బలహీనపరుస్తాయని తెలిపారు. దీన్ని కట్టడి చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.