Deepfake: డీప్‌ఫేక్ వీడియోల కట్టడికి సోషల్ మీడియా సంస్థలతో కేంద్రం సమావేశం
డీప్‌ఫేక్‌లకు సంబంధించిన సమస్యను పరిష్కారం కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోషల్ మీడియా యాజమాన్యాలతో కేంద్రం మంగళవారం సమావేశం నిర్వహించింది. నవంబర్ 24న తొలి సమావేశం నిర్వహించిన కేంద్రం.. ఇప్పుడు రెండో దఫా మీటింగ్ ఏర్పాటు చేశారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అధ్యక్షన ఈ సమావేశం జరిగింది. మొదటి దఫా మీటింగ్‌ను ఏర్పాటు చేసినప్పుడు డీప్‌ఫేక్‌లను తనిఖీ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తమ విధానాలను భారతీయ నిబంధనలకు అనుగుణంగా మార్చడానికి కేంద్రం ఏడు రోజుల గడువు విధించింది. ఈ క్రమంలో కేంద్రం ఆదేశాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు పాటిస్తున్నాయా? లేదా? డీప్‌ఫేక్‌ల కట్టడిలో పురోగతి అంశాలను మంగళవారం పరిశీలించారు.