LOADING...
Rajnath Singh: ఆపరేషన్‌ సింధూర్‌ ఇంకా కొనసాగుతోంది: రాజ్‌నాథ్‌ సింగ్‌
ఆపరేషన్‌ సింధూర్‌ ఇంకా కొనసాగుతోంది: రాజ్‌నాథ్‌ సింగ్‌

Rajnath Singh: ఆపరేషన్‌ సింధూర్‌ ఇంకా కొనసాగుతోంది: రాజ్‌నాథ్‌ సింగ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2025
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్‌ సింధూర్‌ ఇంకా ముగియలేదని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. కొత్తగా తయారు చేసిన 'ఉదయగిరి (F35)','హిమగిరి (F34)'యుద్ధనౌకలను జాతికి అంకితం చేశారు. ఈ నౌకలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డిజైన్‌, స్టెల్త్‌, ఆయుధాలు,సెన్సార్‌ వ్యవస్థలతో రూపొందించారు. దేశంలోని వేర్వేరు షిప్‌యార్డ్లలో నిర్మించబడిన రెండు ఫ్రంట్‌లైన్‌ సర్ఫేస్‌ యుద్ధనౌకలను ఒకేసారి జాతికి అంకితం చేయడం ఇదే మొదటి సందర్భం. ఈ నౌకలు బ్లూ వాటర్‌ పరిస్థితుల్లో రక్షణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగల సామర్థ్యం కలిగి ఉంటాయి.

వివరాలు 

2050 నాటికి దేశంలో 200 యుద్ధనౌకలు

ఈ రెండు నౌకలు బహుళ పాత్రలను నిర్వర్తిస్తాయని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలియజేశారు. "స్వదేశీ యుద్ధనౌక సామర్థ్యానికి ఇవి చిహ్నం. ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం ఈ నౌకలు ఆదర్శంగా ఉంటాయి. ఆధునిక సాంకేతికత ఈ నౌకల రూపకల్పనలో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. 2050 నాటికి దేశంలో 200 యుద్ధనౌకలను నిర్మించుకునే లక్ష్యం మనకు ఉంది" అని ఆయన పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యుద్ధనౌకలను జాతికి అంకితం చేసిన అనంతరం మాట్లాడుతున్న రాజ్‌నాథ్‌ సింగ్‌