Page Loader
ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి.. కుప్పకూలిన డెహ్రాడూన్‌ డిఫెన్స్‌ కాలేజ్
కుప్పకూలిన డెహ్రాడూన్‌ డిఫెన్స్‌ కాలేజ్

ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి.. కుప్పకూలిన డెహ్రాడూన్‌ డిఫెన్స్‌ కాలేజ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 14, 2023
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల ధాటికి డిఫెన్స్‌ కాలేజ్ కుప్పకూలిపోయింది. ఉత్తర భారదేశాన్ని మరోసారి కుంభవృష్టి ముంచేస్తోంది. ఇటీవలే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్థంభించిపోయింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని బియాస్‌ నది మళ్లీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మాల్‌దేవతా జిల్లాలో గల గఢ్వాల్ హిమాలయాల సమీపంలో బండల్ నది ఒడ్డున ఉన్న డెహ్రాడూన్‌ డిఫెన్స్‌ కాలేజ్ బిల్డింగ్ పేకమేడలా కుప్పకూలిపోయింది. 24 గంటలుగా దంచికొడుతున్న వానల కారణంగా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో సోమవారం ఉదయం భవనం ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ క్రమంలోనే భవన శిథిలాలు నదిలో పడిపోయాయి. దీంతో బిల్డింగ్ కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బండల్ నది ఉగ్ర ప్రవాహానికి కుప్పకూలిన డిఫెన్స్ కాలేజ్ భవనం