
Delhi Air Pollution : కాలుష్య కోరల్లో చిక్కుకున్న దిల్లీ.. ఇప్పట్లో ఉపశమనం లేనట్లేనట
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని ప్రాంతం దిల్లీలోని గాలి నాణ్యత ఇంకా 'తీవ్రమైన' కేటగిరీలోనే కొనసాగుతోంది. ఈ మేరకు రానున్న రోజుల్లో తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తీవ్ర వాయు కాలుష్యం కారణంగా దిల్లీ వాసులకు ఇఫ్పట్లో ఉపశమనం లభించే అవకాశం లేదని వాతావరణ శాఖ అంటోంది.
దిల్లీలోని సగటు AQI, ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు కొలుస్తారు. ఈ నేపథ్యంలోనే గురువారం 419 వద్ద గాలి నాణ్యత నమోదైంది.
దీపావళి తర్వాత గాలి నాణ్యత మరింత క్షీణించింది. గాలి నాణ్యతలో గణనీయమైన మార్పుల కారణంగా గత కొన్ని రోజులుగా దిల్లీలో దట్టమైన పొగమంచు నెలకొంది.శుక్రవారం ఉదయం నగరాన్ని మంచు పొగ దట్టంగా కప్పేసింది.
DETAILS
ఇవాళ 404 వద్ద నమోదైన ఏక్యూఐ
సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) రిపోర్ట్ మేరకు, జాతీయ రాజధాని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) శుక్రవారం ఉదయం 404 వద్ద నమోదైంది.
దిల్లీలో వీస్తున్న గాలులు, తక్కువ ఉష్ణోగ్రతలు వెరసి కాలుష్య కారకాలు పేరుకుపోయే వాతావరణాన్ని సృష్టించాయని తెలిపింది.
రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారి ఒకరు గురువారం తెలిపారు.
దిల్లీలోని సగటు AQI, గత ఆదివారం 218, సోమవారం 358, మంగళవారం 397, బుధవారం 401 , శుక్రవారం 279, శనివారం 220గా ఏక్యూఐ ఉన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వాయు కాలుష్యం : తీవ్ర కేటగిరిలో చిక్కుకున్న దిల్లీ మహానగరం
#WATCH | Delhi: Air quality in ‘Severe Category’, drone visuals from Azadpur
— ANI (@ANI) November 17, 2023
(08:20 am) pic.twitter.com/0V0vRPlwFd