Delhi Air pollution: దిల్లీలో అతితీవ్ర వాయు కాలుష్యం.. పాఠశాలలకు ముందస్తు సెలవుల ప్రకటన వివరాలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో విపరీత వాయు కాలుష్యం నేపథ్యంలో ప్రభుత్వం అన్ని పాఠశాలలకు డిసెంబర్ శీతాకాల సెలవులను బుధవారం రీషెడ్యూల్ చేసింది.
దేశ రాజధానిలో వాయు కాలుష్యం 'తీవ్రమైన' కేటగిరీలో కొనసాగుతున్నందున నవంబర్ 9 నుంచి నవంబర్ 18 వరకు సెలవులు ఉంటాయని ప్రకటించింది.
అంతకుముందు గాలి నాణ్యత, AQI క్షీణించడంతో నవంబర్ 3 నుంచి 10 వరకు సెలవులు ప్రకటించారు.
తాజాగా తీవ్ర వాయు కాలుష్యం దృష్ట్యా, అన్ని పాఠశాలలకు డిసెంబర్ శీతాకాల విరామాన్ని దిల్లీ సర్కార్ రీ షెడ్యూల్ చేసింది. GRAP-IV చర్యలను అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదే సమయంలో పాఠశాలలు పూర్తిగా మూసివేస్తున్నట్లు,ఈ మేరకు పిల్లలు, ఉపాధ్యాయులు ఇద్దరూ ఇంట్లోనే ఉండాలని సర్క్యులర్ ద్వారా సర్కార్ కోరింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలలో విద్యార్థులకు ముందస్తు సెలవుల ప్రకటన
Delhi government announces early winter break in schools from 9th to 18th November amid severe air pollution in the national capital pic.twitter.com/g9TDdHouot
— ANI (@ANI) November 8, 2023