 
                                                                                Delhi Pollution: కాలుష్య కోరల్లోనే దిల్లీ..స్వల్పంగా మెరుగుపడ్డ AQI, అయినా ప్రమాదకరంగానే..
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో వాయు కాలుష్యం కోరలు చాస్తోంది. మంగళవారం కాస్త గాలి నాణ్యత మెరుగుపడినప్పటికీ రాజధాని ప్రాంతంలోని చాలా ఏరియాల్లో ఇంకా తీవ్రత కొనసాగుతోంది. ఓవరాల్ గా దిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) మంగళవారం చాలా పేలవమైన కేటగిరీలో నమోదైంది. మరోవైపు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం, నగరం మొత్తం గాలి నాణ్యత సూచిక (AQI) ఉదయం 7 గంటలకు 396 వద్ద నమోదైంది. అయితే, నగరంలోని పలు ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో ఏక్యూఐ 'తీవ్ర' కేటగిరీలో నమోదైంది. ఆనంద్ విహార్‌లోని నిజ-సమయ మానిటరింగ్ స్టేషన్‌లో 438 వద్ద 'తీవ్రమైన' AQIని అధికారులు గుర్తించారు.
DETAILS
దిల్లీలో కొనసాగుతున్న పేలవమైన గాలి నాణ్యత సూచీ
ఇదే సమయంలో ఓఖ్లా ఫేజ్ 2 (422), రోహిణి (444), పంజాబీ బాగ్ (437), న్యూ మోతీ బాగ్ (410).మంగళవారం కూడా దట్టమైన పొగమంచు దిల్లీ మహానగరాన్ని చుట్టుముట్టింది. AQI స్కేల్ ప్రకారం : 0 నుంచి 50 మధ్య గాలి నాణ్యత తనిఖీలు "good", 51 నుంచి 100 "Satisfactory", 101 నుంచి 200 "Moderate", 201 నుంచి 300 "Poor", 301 నుంచి 400 "Very Poor", 401 నుంచి 450 ఉంటే Severe, AQI 450 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు "Extreme"గా గుర్తిస్తారు. దిల్లీలో గాలి నాణ్యత Very Poor కేటగిరిలో కొనసాగుతోంది. నవంబరు 13 నుంచి 20 వరకు బేసి-సరి విధానం అమలు చేయనున్నారు.