Page Loader
Blast near Israel Embassy: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు..ఘటనా స్థలంలోనే బాంబ్ స్క్వాడ్
Blast near Israel Embassy: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు

Blast near Israel Embassy: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు..ఘటనా స్థలంలోనే బాంబ్ స్క్వాడ్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 27, 2023
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్ కాన్సులేట్ భవనం సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు జరిగినట్లు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ధృవీకరించింది. పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో ఇజ్రాయెల్ జెండాతో చుట్టబడిన లేఖ కూడా లభ్యమైందని తెలిపాయి. ఈ లేఖ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన రాయబారిని ఉద్దేశించి పంపినట్లు ఆ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 5:08 (సాయంత్రం) సమయంలో రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుడు సంభవించిందని మేము నిర్ధారించగలము. దిల్లీ పోలీసులు, భద్రతా బృందం పరిస్థితిని ఇంకా దర్యాప్తు చేస్తున్నారు" అని రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు.

Details 

ఖాళీ ప్లాట్‌లో పేలుడు 

దేశ రాజధానిలోని దౌత్యపరమైన ప్రాంతం అయిన చాణక్యపురి ప్రాంతంలో ఉన్న రాయబార కార్యాలయం వెనుక జరిగిన పేలుడుపై దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి పేలుడు సంభవించిందని తెలిపాడు . ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్లాట్‌లో పేలుడు సంభవించిందని కాలర్ పేర్కొన్నాడు.

Details 

సంఘటన స్థలంలో బాంబ్ స్క్వాడ్‌తో పాటు పోలీసు ప్రత్యేక సెల్‌ బృందం

అనంతరం బాంబ్ స్క్వాడ్‌తో పాటు పోలీసు ప్రత్యేక సెల్‌ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ ప్రదేశంలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని ఢిల్లీ ఫైర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ చెప్పారు. పేలుడు గురించి ప్రత్యక్ష సాక్షి వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ "సాయంత్రం 5 గంటల సమయంలో నేను డ్యూటీలో ఉండగా పెద్ద శబ్దం వినిపించింది. బయటికి వచ్చేసరికి చెట్టు పైనుంచి పొగలు కమ్ముకోవడం చూశాను, పోలీసులు నా స్టేట్‌మెంట్ తీసుకున్నారు" అని తెలిపాడు. సమగ్ర విచారణ జరుగుతోంది. లేఖను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.