LOADING...
Air india: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఐదుగురు ఎంపీలకు తప్పిన పెను ముప్పు
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఐదుగురు ఎంపీలకు తప్పిన పెను ముప్పు

Air india: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఐదుగురు ఎంపీలకు తప్పిన పెను ముప్పు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2025
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంలో కాంగ్రెస్ అగ్ర నేతలకు ముప్పు తప్పింది. ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి దిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI 2455) ప్రయాణమధ్యలో అనుకోకుండా రాడార్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. పరిస్థితిని గమనించిన పైలట్లు అప్రమత్తంగా స్పందించి, విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయించారు. ఈ విమానంలో కేరళకు చెందిన నలుగురు ఎంపీలు ఉన్నారు. వారిలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, యూడీఎఫ్ కన్వీనర్ ఆడూర్ ప్రకాష్, సీనియర్ కాంగ్రెస్ నేత కొడికున్నిల్ సురేష్, కె. రాధాకృష్ణన్‌లతో పాటు తమిళనాడు ఎంపీ రాబర్ట్ బ్రూస్ కూడా ప్రయాణిస్తున్నారు.

వివరాలు 

అదృష్టవశాత్తూ ప్రమాదం తప్పింది:కేసీ వేణుగోపాల్

ఘటనపై కేసీ వేణుగోపాల్ 'ఎక్స్' వేదిక ద్వారా స్పందించారు. అదృష్టవశాత్తూ ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. తిరువనంతపురం నుంచి దిల్లీకి బయలుదేరిన విమానంలో టేకాఫ్ తరువాతే సాంకేతిక లోపం బయటపడిందని, పైలట్ చాకచక్యంతో విమానాన్ని చెన్నైకి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించారని తెలిపారు. పైలట్ తీసుకున్న వేగవంతమైన నిర్ణయం వల్లే ప్రయాణికుల ప్రాణాలు రక్షించబడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు. తాము భయంకర విషాదం నుంచి తృటిలో తప్పించుకున్నామని గుర్తుచేశారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సాంకేతిక లోపం, అత్యవసర ల్యాండింగ్ పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న కేసీ వేణుగోపాల్