LOADING...
Delhi: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ప్రొటెం స్పీకర్‌గా అరవిందర్ ఎన్నిక

Delhi: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ప్రొటెం స్పీకర్‌గా అరవిందర్ ఎన్నిక

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 27 సంవత్సరాల విరామం తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వచ్చింది. రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, ఈ హోదాలో తొలిసారి అసెంబ్లీలో ప్రవేశించారు. మరోవైపు, ప్రొటెం స్పీకర్‌గా అరవిందర్ సింగ్ లవ్లీ ఎన్నికయ్యారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాజ్ నివాస్‌లో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరికీ ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. తర్వాత,మొదటగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయగా,ఆ తరువాత ఢిల్లీ కేబినెట్ మంత్రులుగా పర్వేష్ సాహిబ్ సింగ్,ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా,రవీందర్ ఇంద్రజ్ సింగ్ లు ప్రమాణం చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు.

వివరాలు 

ప్రతిపక్ష నాయకురాలిగా అతిషి ఎంపిక 

ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అతిషి ఎన్నికయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను గౌరవిస్తామని, వారి తరఫున బాధ్యతగా నిలుస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తొలి కేబినెట్ సమావేశంలోనే మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయ పథకాన్ని అమలు చేయాలని ప్రకటించారని, దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఆప్ ఎమ్మెల్యేలు కృషి చేస్తారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిందని బీజేపీ నిరూపించే ప్రయత్నం చేస్తోందని, అయితే అలాంటి ఆరోపణలను తిప్పికొడతామని అతిషి స్పష్టం చేశారు.

వివరాలు 

బీజేపీకి స్పష్టమైన మెజారిటీ 

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా, బీజేపీ 48 స్థానాలు గెలుచుకుని పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకు పరిమితమైంది. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి ప్రముఖ ఆప్ నేతలు ఓటమిపాలయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రమాణ స్వీకారం చేయిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్