LOADING...
Attack on Delhi CM: దిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి.. అదపులో నిందితుడు 
దిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి.. అదపులో నిందితుడు

Attack on Delhi CM: దిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి.. అదపులో నిందితుడు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2025
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. సివిల్‌ లైన్స్‌లోని ఆమె అధికారిక నివాసంలో 'జన్‌ సున్‌వాయ్‌' కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సుమారు 35 ఏళ్ల వయసు కలిగిన ఒక వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. మొదట అతడు కొన్ని పత్రాలను ముఖ్యమంత్రికి అందజేసిన అనంతరం,దాడి చేసినట్లు తెలిసింది. ఈ సంఘటనపై స్పందించిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్‌ తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి