
Delhi :దిల్లీ ప్రధాన కార్యదర్శికి ఎసరు.. సీఎం కేజ్రీవాల్ కు 650 పేజీల లేఖ రాసిన మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మంత్రి అతిషి ఓ నివేదిక సమర్పించారు. ఈ మేరకు దిల్లీ జాతీయ రాజధానిలో సంచలనం సృష్టిస్తుంది.
ఈ క్రమంలోనే చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌కు సంబంధించిన అవినీతి కేసులో దిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ మంత్రి అతిషి 650 పేజీల ప్రాథమిక నివేదికను ముఖ్యమంత్రికి అందించారు.
ప్రధాన కార్యదర్శి తన కుమారుడి కంపెనీకి రూ. 850 కోట్ల అక్రమ లాభాలు సమకూర్చినట్లు విచారణలో వెల్లడైందని అతిషి చెప్పారు.
ఆప్ ప్రభుత్వంలో విజిలెన్స్ మంత్రిగా ఉన్న అతిషి అవినీతికి సంబంధించిన కేసులో ముఖ్యమంత్రికి 650 పేజీల ప్రాథమిక నివేదికను అందించడం గమనార్హం.
ఈ కేసులో సీఎస్ నరేష్ కుమార్,ఆయన కుమారుడికి సంబంధించి భారీగా లబ్ధి చేకూర్చారని ఆమె ఆరోపించారు.
details
సదరు కంపెనీకి రూ. 850 కోట్ల లాభాలు : నివేదిక
ఈ నేపథ్యంలోనే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు విజిలెన్స్ మంత్రి అతిషి ప్రాథమిక నివేదిక సమర్పించారు.
మరోవైపు నరేష్‌కుమార్‌పై ఆరోపణలు నిరాధారమని, నీచమైన రాజకీయాల్లో భాగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారని విపక్షాలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
తన కుమారుడి కంపెనీకి నరేశ్ కుమార్, రూ. 850 కోట్ల అక్రమ లాభాలు సమకూర్చినట్లు విచారణలో స్పష్టమైందని అతిషి నివేదిక ద్వారా పేర్కొన్నారు.
2015లో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో కేవలం రూ. 75 లక్షలకే భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోందన్నారు.
ఖరీదైన భూమిని స్వాధీనం చేసుకున్నారని, అనంతరం సదరు కంపెనీకి రూ. 850 కోట్ల లాభాలు వచ్చాయన్నారు.
ఎక్స్‌ప్రెస్‌వే కుంభకోణంపై సీఎం కేజ్రీవాల్‌కు ఇప్పటికే ఫిర్యాదు అందగా,ఈ వ్యవహారంపై నరేష్‌కుమార్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం గమనార్హం.