Page Loader
G-20 డిక్లరేషన్ రెడి, ప్రపంచ దేశాధినేతల ఆమోదం తర్వాత పూర్తిగా వెల్లడిస్తాం - షెర్పా అమితాబ్ కాంత్
దిల్లీ డిక్లరేషన్ రెఢీ

G-20 డిక్లరేషన్ రెడి, ప్రపంచ దేశాధినేతల ఆమోదం తర్వాత పూర్తిగా వెల్లడిస్తాం - షెర్పా అమితాబ్ కాంత్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 08, 2023
06:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

G-20 శిఖరాగ్ర సమానేశాలకు దిల్లీ డిక్లరేషన్ రెడి అయ్యింది. ఈ మేరకు ప్రపంచ దేశాధినేతల ఆమోదం తర్వాత త్వరలోనే ఇందులోని అంశాలను వెల్లడిస్తామని జీ-20 భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ ప్రకటించారు. సదస్సుకి మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్న అమితాబ్ కాంత్ డిక్లరేషన్ కు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు గ్లోబల్ సౌత్‌ (తక్కువ ఆదాయ గల దేశాలు)కు సంబంధించిన విషయాలు నివేదికలో పొందుపర్చామన్నారు. మరోవైపు అస్థిరమైన ప్రజాస్వామ్యం గల దేశాలను గ్లోబల్ సౌత్‌గా పిలుస్తుంటారు. గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా న్యూదిల్లీ డిక్లరేషన్ ఉంటుందన్నారు. జీ-20 దేశాధినేతలు ఈ నివేదికకు అంగీకారం తెలిపాకే పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. అప్పటి వరకు గోప్యంగా ఉంచక తప్పదన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దిల్లీ డిక్లరేషన్ రెడి: అమితాబ్ కాంత్