Page Loader
Air Pollution : దిల్లీలో పొగమంచు కమ్మేసింది.. వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కరి
దిల్లీలో పొగమంచు కమ్మేసింది.. వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కరి

Air Pollution : దిల్లీలో పొగమంచు కమ్మేసింది.. వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కరి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2024
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో వాయు కాలుష్య తీవ్రత కొద్దిగా తగ్గింది. అయితే ఇంకా అది తీవ్రమైన స్థాయిలోనే ఉంది. ఇటీవల ధిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 400ను అందుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇది 300 నుంచి 400 మధ్య కొనసాగుతోంది. అయినా కాలుష్య స్థాయి తీవ్రమైనదే కావడంతో ప్రజలకు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం బుధవారం ఉదయం 7 గంటలకు ఢిల్లీ ఏక్యూఐ 301గా నమోదైంది. లోధి రోడ్‌లో 254, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద 298, ఓఖ్లా ఫేజ్‌లో 298, డీటీయూలో 250, పూసాలో 281 నమోదయ్యాయి.

Details

అనారోగ్య సమస్యల భారీన ప్రజలు

కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా అశోక్‌ విహార్ (316), ఆనంద్‌ విహార్ (311), ఐటీవో (316), వజీర్‌పూర్ (331), వివేక్‌ విహార్ (318), షాదీపూర్ (375) ప్రాంతాల్లో ఏక్యూఐ 300కి పైగా నమోదైంది. ఇది మరింత తీవ్రమైన కాలుష్యాన్ని సూచిస్తుంది. గాలి నాణ్యత సూచీని ఆధారంగా చూస్తే.. 0-50: మంచి 51-100: సంతృప్తికరమైనది 101-200: మితమైన 201-300: తక్కువ 301-400: చాలా పేలవమైనది 401-500: ప్రమాదకరమైనది ఈ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే దిల్లీలో ఇప్పుడు వాయు కాలుష్యం అత్యధికంగా ఉందని చెప్పవచ్చు, ఇది ప్రజల శ్వాస సంబంధిత ఇబ్బందులకు దారి తీస్తోంది.