Delhi Railway Station stampede: దిల్లీలో తొక్కిసలాట ఘటనపై కోర్టు ప్రశ్న.. అన్ని ఎక్కువ టికెట్లు ఎందుకు అమ్మారు..?
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై (Delhi Railway Station stampede) కేంద్రం, భారతీయ రైల్వేపై దిల్లీ హైకోర్టు బుధవారం తీవ్రంగా స్పందించింది.
అనధికారికంగా పరిమితికి మించి టికెట్లు ఎందుకు విక్రయించారని ప్రశ్నించింది.
భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, రైలు బోగీల్లో ప్రయాణికుల సంఖ్యను పరిమితం చేసే నిబంధనలను అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.
వివరాలు
తొక్కిసలాటలో 18 మంది మృతి
కుంభమేళా (Kumbh Mela) కారణంగా పెద్దఎత్తున భక్తులు ప్రయాణించడంతో, గతవారం న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట (Delhi Railway Station stampede) జరిగింది.
14వ నంబరు ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నిలిచివుండడంతో భక్తులు అక్కడకు చేరుకున్నారు.
స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యమవడంతో, వాటి కోసం వచ్చిన ప్రయాణికులు 12, 13, 14 నంబరు ప్లాట్‌ఫాంలపై గుమిగూడారు.
దీంతో ఒక్కసారిగా రద్దీ పెరిగి, తొక్కిసలాటకు దారితీసింది. ఈ విషాదకర ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.