తదుపరి వార్తా కథనం
Kavitha: కవితకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 01, 2024
05:37 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ, ఈడీ కేసుల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది.
సీబీఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీలాండరింగ్ కేసులో తన బెయిల్ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కవిత సవాలు చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
BREAKING:
— M9 NEWS (@M9News_) July 1, 2024
Kavitha denied bail in the liquor case by Delhi High Court; she will continue to remain in Tihar jail.
It has been 108 days since her arrest!#KCR #BRS #KTR