LOADING...
Delhi: ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు
Delhi: ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు

Delhi: ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2025
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో, హైకోర్టులో పలు బెంచ్‌ల న్యాయమూర్తులు కోర్టు కార్యాచరణను తాత్కాలికంగా నిలిపివేశారు. న్యాయవాదులను హైకోర్టు ప్రాంగణం ఖాళీ చేయాలని భద్రతా సిబ్బంది సూచనలు చేశారు. బెదిరింపు మెయిల్‌లో పేర్కొన్న సమాచారం మేరకు, బాంబ్ స్క్వాడ్ వివిధ ప్రదేశాల్లో తనిఖీలు ప్రారంభించింది. హైకోర్టు ఆవరణలో మూడు ప్రదేశాల్లో ఆర్డీఎక్స్‌ అమర్చామని.. పాక్‌తో ఐసిస్‌తో సంబంధాలున్నట్లు మెయిల్‌లో ప్రస్తావించారు.

వివరాలు 

సైబర్ ఫోరెన్సిక్ శాఖ దర్యాప్తు 

గత నెలలో కూడా దేశంలోని అనేక స్కూళ్లకు ఇలానే బాంబు బెదిరింపుల మెయిల్స్, ఫోన్ కాల్స్ రావడం వలన అధికారులు అప్రమత్తతతో దర్యాప్తు ప్రారంభించి, సమగ్ర తనిఖీలు చేపట్టారు. ఈమెయిల్స్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ ఫోరెన్సిక్ శాఖ దర్యాప్తు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు, అంతర్జాతీయ IP అడ్రస్‌లు, వర్చువల్ ప్రాక్సీలను వినియోగిస్తూ బెదిరింపులు పంపినట్లు గుర్తించారు. స్కూళ్లు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాసామాన్య ప్రదేశాలు, విమానాల్లోనూ బాంబు ఉన్నట్లు చేసిన బెదిరింపులు ముఖ్యంగా ఎక్కువగా రావటం గమనార్హం.