Page Loader
Delhi : ఢిల్లీలో బాలికపై కత్తితో దాడి.. సీసీటీవీ ఫుటేజీ వైరల్‌
ఢిల్లీలో బాలికపై కత్తితో దాడి.. సీసీటీవీ ఫుటేజీ వైరల్‌

Delhi : ఢిల్లీలో బాలికపై కత్తితో దాడి.. సీసీటీవీ ఫుటేజీ వైరల్‌

వ్రాసిన వారు Stalin
Mar 24, 2024
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో దారుణం జరిగింది. ముఖర్జీ నగర్‌లో అమన్ అనే యువకుడు మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే బాలికపై కత్తితో దాడి చేశాడు. బాలికకు స్వల్ప గాయాలైనప్పటికీ, ఆమె ప్రాణాపాయం నుండి బయటపడింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. యుకుడిని స్థానికులు అడ్డుకుని పట్టుకునే ప్రయత్నం చేయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. యువకుడి దాడిలో గాయపడిన బాలికకు చికిత్స అందిస్తున్నారు. అయితే దాడి చేసిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 బాలికపై కత్తితో దాడి చేస్తున్న వీడియో ఇదే..