Delhi Pollution : బేసి,సరి రూల్ వాయిదా.. రాజధానిలో మెరుగవుతున్న గాలి నాణ్యత
భారతదేశం రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా అదుపులోకి వస్తోంది. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మెల్లగా గాలి నాణ్యత (AQI), అదుపులోకి వస్తోందని దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఫలితంగా నవంబరు 13 నుంచి నవంబర్ 20 వరకు బేసి-సరి పథకం అమలును నిలిపేస్తున్నట్లు చెప్పారు. బేసి సరి విధానంలో రిజిస్ట్రేషన్ నంబర్‌ల ఆధారంగా (ప్రైవేట్ యాజమాన్యం వాహనాలు) కార్ల ట్రాఫిక్‌ను పరిమితం చేస్తుంది. దీపావళి తర్వాత రోజు(నవంబర్ 13) నుంచి దీన్ని అమలు చేసేందుకు సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. వాతావరణంలో మార్పులు, జాతీయ రాజధాని పరిధిలో గాలి నాణ్యత మెరుగవుతుండటంతో ఈ విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాయ్ చెప్పుకొచ్చారు.