Loading...
Delhi Protest Impact: ఢిల్లీలో నిరసన సెగ.. పలు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు, పరీక్షలు వాయిదా
ఢిల్లీలో నిరసన సెగ.. పలు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు, పరీక్షలు వాయిదా

Delhi Protest Impact: ఢిల్లీలో నిరసన సెగ.. పలు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు, పరీక్షలు వాయిదా

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2026
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

జంతర్‌మంతర్‌ వద్ద నిరసన కార్యక్రమం నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలోని పలు పాఠశాలలు, కళాశాలలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. విద్యార్థుల భద్రత, మెట్రో సేవలకు అంతరాయం కలిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని శనివారం (అక్టోబర్‌ 10) తరగతులను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని కొన్ని పాఠశాలలు నిర్ణయించాయి. మరికొన్ని విద్యాసంస్థలు పీటీఎం సమావేశాలను వాయిదా వేయడంతో పాటు పరీక్షలను కూడా వాయిదా వేశాయి.

వివరాలు 

ఆన్‌లైన్‌లో తరగతులు.. కార్యక్రమాలు వాయిదా

సర్దార్‌ పటేల్‌ విద్యాలయ 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు శనివారం ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించనున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది.

న్యూఢిల్లీ ప్రాంతంలో పెద్దఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయడం,విద్యార్థుల భద్రతపై ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

శనివారం జరగాల్సిన యాక్టివిటీ వీక్‌ ప్రారంభోత్సవం కూడా వాయిదా వేసింది.దీనికి సంబంధించిన కొత్త తేదీని తర్వాత ప్రకటించనుంది.

రఘుబీర్‌ సింగ్‌ జూనియర్‌ మోడ్రన్‌ స్కూల్‌ కూడా శనివారం జరగాల్సిన పీటీఎం సమావేశాన్ని వాయిదా వేసింది.

విద్యార్థుల ప్రోగ్రెస్‌ రిపోర్టులపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

కొత్త తేదీని త్వరలో తల్లిదండ్రులకు తెలియజేస్తామని పాఠశాల వెల్లడించింది.

వివరాలు 

కళాశాలల్లోనూ పరీక్షలు వాయిదా

కస్తూర్బా గాంధీ మార్గ్‌లోని భారతీయ విద్యాభవన్‌ మెహతా విద్యాలయ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

జంతర్‌మంతర్‌ వద్ద ప్రతిపాదిత నిరసన, విద్యార్థుల భద్రతపై ఆందోళనల కారణంగా శనివారం జరగాల్సిన క్రీడా దినోత్సవ సాధనతో పాటు 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల ఎన్‌రిచ్‌మెంట్‌ తరగతులను రద్దు చేసింది.

పశ్చిమ్‌ విహార్‌లోని భారతీయ విద్యాపీఠ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ శనివారం జరగాల్సిన మిడ్‌టర్మ్‌ పరీక్షలను సోమవారానికి వాయిదా వేసింది.

పలు మెట్రో స్టేషన్ల ప్రవేశ,నిష్క్రమణ ద్వారాలను మూసివేసే అవకాశం ఉండటంతో పాటు రైలు సేవలకు అంతరాయం కలగవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ADVERTISEMENT

వివరాలు 

కళాశాలల్లోనూ పరీక్షలు వాయిదా

గురు గోబింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం (జీజీఎస్‌ఐపీయూ) పరిధిలోని యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ అండ్‌ టెక్నాలజీ (యూఎస్‌ఐసీటీ) డీన్‌, ఢిల్లీ పోలీసుల ట్రాన్స్‌పోర్ట్‌ విభాగం జాయింట్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు పరీక్షలను వాయిదా వేసినట్లు కళాశాల ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే, కొత్త తేదీన పరీక్షల సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.

రోహిణిలోని మహారాజా అగ్రసేన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కూడా శనివారం జరగాల్సిన మిడ్‌టర్మ్‌ పరీక్షలను అక్టోబర్‌ 12వ తేదీకి వాయిదా వేసింది.

మెట్రో సేవలపై ఆంక్షలు ఉండవచ్చని ఢిల్లీ పోలీసుల నుంచి సమాచారం అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు 

దిల్లీలో మూతపడనున్న 57 మెట్రోస్టేషన్లు

యూఎస్‌ఐసీటీ డీన్‌, బీటెక్‌ ప్రోగ్రామ్‌ సమన్వయ కమిటీ ఆమోదంతో పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపింది.

మారిన పరీక్షల షెడ్యూల్‌ను అధ్యాపకులు, విద్యార్థులకు తెలియజేయాలని విభాగాధిపతులను ఆదేశించింది.

జంతర్‌మంతర్‌ వద్ద నిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ)కు కీలక సూచనలు చేశారు.

శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు 57 మెట్రో స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేయాలని కోరారు.

నిరసనకారులు సున్నితమైన ప్రాంతాల వైపు వెళ్లే అవకాశం ఉండటంతో పాటు పరిస్థితులు అదుపు తప్పవచ్చన్న అంచనాలతో ఈ చర్యలు తీసుకోవాలని సూచించారు.

వివరాలు 

అక్టోబర్‌ 10న పలు రైళ్లు రద్దు

మరోవైపు, రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో భారతీయ రైల్వేలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి.

అక్టోబర్‌ 10న తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ,హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైల్వే స్టేషన్లకు చేరుకోవాల్సిన అన్ని మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేశాయి.

ఈ రెండు స్టేషన్ల పరిసరాల్లో తీవ్ర ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడితే రైళ్లలో దిగిన ప్రయాణికులు ట్యాక్సీలు, ఇతర రవాణా సదుపాయాలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి.

ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి.

ఈ రద్దు న్యూఢిల్లీ, హజ్రత్‌ నిజాముద్దీన్‌ స్టేషన్లకు చేరుకునే రైళ్లకు సంబంధించిందేనని స్పష్టం చేశాయి.

వివరాలు 

జ్ఞాన్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్

ప్రత్యేక ఓటరు జాబితాల సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్‌ చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే జంతర్‌మంతర్‌ వద్ద నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ సిద్ధమవుతోంది.

ఈ ఆందోళన కారణంగా ఢిల్లీలో రవాణా వ్యవస్థపై ప్రభావం పడవచ్చన్న అంచనాలతో విద్యాసంస్థలు, రైల్వే శాఖ ముందస్తు చర్యలు చేపట్టాయి.

ADVERTISEMENT