దిల్లీలో దయనీయంగా గాలి నాణ్యత.. లాక్‌డౌన్ దిశగా దేశ రాజధాని
దిల్లీలో గాలి నాణ్యతపై రోజురోజుకు దిగజారుతోంది. ఇప్పటికే దిల్లీలో గాలి నాణ్యత 302కు చేరుకోవడం గమనార్హం. దీంతో దిల్లీ వాసులు గాలి పీల్చుకోవాడానికి కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ సూచీ(ఏక్యూఐ) సగటున 200-300 మధ్య ఉండాల్సింది. కానీ ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. దీపావళికి ముందే గాలి నాణ్యత ఇలా ఉందంటే, ఇక పండగ తర్వాత మరింత దారణంంగా ఏక్యూఐ పడిపోతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దిల్లీలో వాయు నాణ్యత ఇలాగే తగ్గిపోతే, లాక్‌డౌన్ తప్పదని అంటున్నారు. కార్యాలాయాలు అన్ని మూసేసి, వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్‌లో పని చేయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విద్యాసంస్థలు కూడా మూసివేసే అవకాశం ఉంటుంది.
దిల్లీలో వాతావరణంపై ఎయిర్ క్వాలిటీ కమిషన్ ఆందోళన
దిల్లీలో వాతావరణంపై ఎయిర్ క్వాలిటీ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రజలకు కీలక సూచనలు చేసింది. ప్రజలు వీలైనంత వరకు సొంత, ప్రైవేట్ వాహనాలకు దూరంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ప్రజా రవాణాను ఉపయోగించుకోవడం వల్ల వాతావరణం కాస్త మెరుగుపడుతుందన్నారు. అంతేకాకుండా పార్కింగ్ ఫీజులు పెంచాలని, అలాగే ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు, మెట్రో సర్వీసులను గణనీయంగా పెంచాలని గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్‌ఏపీ) కింద ఎయిర్ క్వాలిటీ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దిల్లీలో వాయి నాణ్యత ఏమాత్రం తగ్గిన, అధికారులు చాలా కఠినంగా ఆంక్షలు విధించే అవకాశం ఉంది.