MLC Kavitha: ఎక్సైజ్ పాలసీలో కవితకు మరో షాక్ .. జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితురాలు, బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. కోర్టు ఆమె జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు పొడిగించింది. ఆమెకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ దరఖాస్తు చేసింది. మంగళవారంతో జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో తీహార్ జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. తన కొడుకు పరీక్షల దృష్ట్యా తల్లి బాధ్యతలు నిర్వర్తించాలంటూ తెలంగాణ మాజీ సీఎం కూతురు కోర్టును ఆశ్రయించింది. కాగా, ఈ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు ఢిల్లీలోని తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.