Page Loader
దిల్లీ-సిడ్నీ: గాలిలో ఉన్న ఎయిర్ ఇండియా విమానంలో కుదుపు, ప్రయాణికులకు గాయాలు 
దిల్లీ-సిడ్నీ: గాలిలో ఉన్న ఎయిర్ ఇండియా విమానంలో కుదుపు, ప్రయాణికులకు గాయాలు

దిల్లీ-సిడ్నీ: గాలిలో ఉన్న ఎయిర్ ఇండియా విమానంలో కుదుపు, ప్రయాణికులకు గాయాలు 

వ్రాసిన వారు Stalin
May 17, 2023
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ నుంచి సిడ్నీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గాలిలో ఉండగానే భారీ కుదుపునకు లోనైంది. ఈ ఘటనతో విమానంలోని కొంతమంది ప్రయాణికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదని, గాయపడిన వారికి వైద్య సహాయం అందించామని అధికారులు తెలిపారు. అయితే గాయపడిన వారికి విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్, నర్సు సాయంతో క్యాబిన్ సిబ్బంది ఆన్‌బోర్డ్ ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను ఉపయోగించి ప్రథమ చికిత్స అందించినట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది.

సిడ్నీ

ఎవరికీ ఆసుపత్రి చేరాల్సిన అవసరం రాలేదు: ఎయిర్‌లైన్ 

సిడ్నీలోని ఎయిర్‌పోర్ట్ మేనేజర్ కూడా ప్రయాణీకులు రాగానే వైద్య సహాయాన్ని ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. సిడ్నీ విమానాశ్రయంలో ఏడుగురు ప్రయాణికులు వైద్య సహాయం పొందారని, వారిలో ఎవరికీ ఆసుపత్రి అవసరం లేదని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. 16 మే 2023 నాటి ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుంచి సిడ్నీకి వెళ్తుండగా, గాలి మధ్యలో ఒక్కసారిగా కుదుపుకు లోనైనట్లు ఎయిర్‌లైన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ క్రమంలో విమానంలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగినట్లు, అయితే విమానం మాత్రం చివరికి సురక్షితంగా సిడ్నీలో ల్యాండ్ అయినట్లు వెల్లడించారు.