
Rahul Gandhi: ప్రజాస్వామ్యాన్ని చిదిమేయడానికి ప్రయత్నాలు.. అమెరికాలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ, భారత ప్రజాస్వామ్యంపై భాజపా పాలనను దుయ్యబట్టారు.
వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
గత పదేళ్లలో భారతదేశ ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైందని, కానీ ప్రస్తుతం దానిని తిరిగి నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.
భారత ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, దానిని చిదిమేయడానికి కృషి కొనసాగుతోందన్నారు.
Details
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు పోరాటాలు
మహారాష్ట్రలో తమ శాసనసభ్యులు అనూహ్యంగా భాజపాలో చేరిపోయారు. ఇదంతా తన కళ్లు ముందే జరిగిందని, దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని రాహుల్ గాంధీ అన్నారు.
ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని రాహుల్ అన్నారు.
ఇప్పటికే ప్రజాస్వామ్యం బలహీనంగా మారిపోయిందని, కానీ ఇప్పుడు దానిని నిలబెట్టేందుకు పోరాటం జరుగుతోందన్నారు.