
Telangana: మూసీ రివర్‌బెడ్‌లో ఇళ్లు కూల్చివేత.. ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
మలక్‌పేట శంకర్‌నగర్‌లో మూసీ రివర్‌బెడ్ ప్రాంతంలో ఉన్న ఇళ్ల కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు.
ఇళ్లను స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల గృహాలు కూల్చివేత జరుగుతోంది.
వీధులు ఇరుకుగా ఉండటంతో, కూలీల సహాయంతో ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. నిర్వాసితులను ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది.
వారికి అవసరమైన సామగ్రి తరలింపునకు వాహనాల సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
అంబర్‌పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్ తులసి రామ్ నగర్‌లో, మూసీ పరివాహక ప్రాంత వాసులను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించనున్నారు.
Details
ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి
ఇళ్ల కూల్చివేతలపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇళ్లు కూల్చి అక్కడ పార్కులు కడతారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని విమర్శించి, నిర్వాసితుల పక్షాన నిలిచిన విషయం తెలిసిందే.