Dense Fog: తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలను పొగమంచు కమ్ముకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి వంటి ప్రాంతాల్లో దట్టంగా మంచు పడుతోంది.
ఈ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను పొగమంచు కమ్మేసింది.
ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉదయం 7 గంటలకు కూడా దట్టంగా మంచు కురుస్తోంది.
దీనితో వాహనదారులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. చలిగాలులు, పొగమంచుతో ప్రజలు నానా అవస్థలు అనుభవిస్తున్నారు.
పొగమంచు కారణంగా రోడ్లు కనిపించకపోవడంతో వాహనాలు మెల్లగా వెళ్తున్నాయి.
నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ పరిసరాల్లో మంచు మరింతగా దట్టంగా కమ్ముకుంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. కూడళ్లలో జాగ్రత్తగా వెళ్ళాలని పోలీసులు సూచిస్తున్నారు.
వివరాలు
విజయవాడలో కూడా పొగమంచు
మరో వైపు, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కూడా పొగమంచు భారీగా కురుస్తోంది.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా మంచు కమ్ముకుంది.
ఈ కారణంగా విమానాల రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి. రన్‌వే కనబడకపోవడంతో విజయవాడలో దిగాల్సిన ఇండిగో విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది.