Page Loader
Wayanad Landsildes : కొండచరియలు విరిగిపోవడానికి కారణమేమిటి.. ప్రమాదానికి ముందు సంకేతాలివే!
కొండచరియలు విరిగిపోవడానికి కారణమేమిటి.. ప్రమాదానికి ముందు సంకేతాలివే!

Wayanad Landsildes : కొండచరియలు విరిగిపోవడానికి కారణమేమిటి.. ప్రమాదానికి ముందు సంకేతాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2024
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళలోని వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాలలో మంగళవారం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే 70 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఇంకా మరో వంద మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కొండచరియలు ఎలా సంభవిస్తాయో, వాటిని ఎలా అంచనా వేయచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Details

ప్రవాహాల కోత కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం

వర్షపాతం, మంచు కరగడం, ప్రవాహాల కారణంగా కోత, భూకంపాలు, భూగర్భ జలాల్లో మార్పులు, అగ్ని పర్వతాలు, మానవ కార్యకలాపాల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది. కొండ లేదా పర్వతం వాలును ఏర్పరుచుకునే క్రమంలో జియోమెటీరియల్ బలాన్ని మించి గురుత్వాకర్షణ కలిగి ఉండడం వల్ల కొండచరియలు విరిగిపడతాయి. జియోమెటీరియల్స్ అంటే రాళ్ళు, ఇసుక, సిల్ట్, బంకమట్టి అని చెప్పచ్చు. ఇక భూకంపాలు, తుపాను ధాటికి అలల ఉద్ధృతి పెరగడం వల్ల సముద్ర గర్భంలో ఇలా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నిటారుగా ఉండే కొండలు, లోయల దిగువ భాగాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Details

ప్రమాదాన్ని ముందుగా గుర్తించడం కష్టం

అటవీ నిర్మూలన వాలు స్థిరత్వంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది, ఎందుకంటే చెట్ల మూలాలు సహజంగా భూమిని బలపరిచి, నీటిని బయటకు పంపుతాయి. ఇక పేలుళ్లు సమీపంలోని వాలులు కదిలే అవకాశం ఉంది. కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని ముందుగా గుర్తించడం కష్టం. చెట్లు పడిపోతున్నశబ్దం, రాళ్లు దొర్లుతున్న శబ్దాలు వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. నీటి సమూహాల సమీపంలో ఉంటే నీటి మట్టం హఠాత్తుగా పెరగడం, తగ్గడం, అంతవరకు తేటగా ఉన్న నీరు బురదలా మారడం వంటి మార్పులు కనిపిస్తే వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయడం మంచిది.