Page Loader
Hotel Cheating: ఢిల్లీలో ఏపీ మహిళా మోసం..హోటల్‌లో Rs. 6 లక్షల బిల్లు..బ్యాంకు ఖాతాలో 41 రూపాయలు
ఢిల్లీలో ఏపీ మహిళా మోసం..హోటల్‌లో Rs. 6 లక్షల బిల్లు..బ్యాంకు ఖాతాలో 41 రూపాయలు

Hotel Cheating: ఢిల్లీలో ఏపీ మహిళా మోసం..హోటల్‌లో Rs. 6 లక్షల బిల్లు..బ్యాంకు ఖాతాలో 41 రూపాయలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2024
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ఏరోసిటీలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో ఓమహిళ బస చేసింది.అయితే బిల్లు సుమారు ₹ 6 లక్షలు కాగా..యూపీఐ ద్వారా డబ్బులు పంపినట్లు మోసానికి పాల్పడింది. దింతో హోటల్‌ యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ మహిళను ఆరా తీయగా బ్యాంకు ఖాతాలో కేవలం రూ.41మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ప్రకారం..ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఝాన్సీ రాణి శామ్యూల్ అనే మహిళ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ఏరోసిటీలో ఉన్న పుల్‌మన్ హోటల్‌లో 15రోజుల పాటు బస చేసి దాదాపు ₹.5,88,176 బిల్లు చేసిందని పోలీసులు తెలిపారు. హోటల్ లో స్పా కోసం ఆమె నకిలీ గుర్తింపు కార్డును తయారు చేసి ₹2,11,708 విలువైన సేవలను పొందినట్లు హోటల్ సిబ్బంది పోలీసులకు తెలిపారు.

Details 

జనవరి 13న అరెస్టు అయ్యిన ఝాన్సీ రాణి శామ్యూల్

ఝాన్సీ రాణి శామ్యూల్ ఐసిఐసిఐ బ్యాంక్ యుపిఐ యాప్‌లో లావాదేవీలు జరుపుతున్నట్లు హోటల్ సిబ్బందికి చూపించిందని, అయితే బ్యాంకు ఖాతాలో డబ్బులు పడకపోవడంతో.. హోటల్‌ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జనవరి 13న ఆమెను అరెస్టు చేశారు. నిందితురాలు విచారణకు సహకరించడం లేదని ఓ అధికారి తెలిపారు. తాను వైద్యురాలని, తన భర్త కూడా వైద్యుడని, న్యూయార్క్‌లో నివసిస్తున్నాడని, ఆమె మొదట పోలీసులకు చెప్పింది. ఆమెను మొదట మోసం చేసినందుకు అరెస్టు చేశారు, అయితే తరువాత IPC సెక్షన్లు 419 (వంచించడం ద్వారా మోసం చేసినందుకు శిక్ష), 468 (మోసం కోసం ఫోర్జరీ చేయడం), 471 (నిజమైన నకిలీ పత్రంగా ఉపయోగించడం) ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు అధికారి తెలిపారు.