Page Loader
ఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ. 20లక్షల జరిమానా విధించిన డీజీసీఏ
ఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ. 20లక్షల జరిమానా విధించిన డీజీసీఏ

ఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ. 20లక్షల జరిమానా విధించిన డీజీసీఏ

వ్రాసిన వారు Stalin
Feb 11, 2023
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరో ఎయిర్‌లైన్స్‌‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కొరడా ఝులిపించింది. పౌర విమానయాన అవసరాలను ఉల్లంఘించినందుకు ఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ.20 లక్షల జరిమానా విధించింది. విమానంలో సిబ్బంది తప్పనిసరిగా చేయాల్సిన రోజువారి విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల విమానయాన సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఘటనలు తరుచూ ఉత్పత్తన్నమవుతున్న నేపథ్యంలో డీజీసీఏ సీరియస్‌గా తీసుకుంటోంది. ఇంకోసారి తప్పు జరగకుండా ఉండేందుకు బాధ్యులకు భారీగా జరిమానా విధిస్తోంది.

ఎయిరేషియా

8 మంది సిబ్బందికి రూ.3 లక్షల చొప్పున జరిమానా

ఎయిరేషియా పైలెట్లు విధుల నిర్వహణలో విఫలమయ్యారని డీజీసీఏ స్పష్టం చేసింది. ఈ క్రమంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన 8 మంది సిబ్బందికి కూడా ఫైన్ వేసింది. ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున జరిమానా విధించింది. ఏయిరేషియా సంస్థ రూ.20లక్షలు, సిబ్బందికి రూ.3 లక్షల చొప్పున పైన్ చెల్లించాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూడా పలు విమానయాన సంస్థలకు డీజీసీఏ జరిమానా విధించింది. 'గో ఫస్ట్‌' విమానానికి రూ.10 లక్షలు, ఎయిర్ ఇండియాకు ఒక ఘటనలో రూ.30లక్షలు, మరో ఘటనలో రూ.10లక్షల జరిమానా డీజీసీఏ విధించింది.