తదుపరి వార్తా కథనం
Telangana: సైబర్ నేరాల నివారణకు 'ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్'.. ప్రచారాన్ని ప్రారంభించిన డీజీపీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 02, 2025
05:25 pm
ఈ వార్తాకథనం ఏంటి
సైబర్ నేరాల నుండి మనలను రక్షించేది మన అప్రమత్తతేనని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి స్పష్టం చేశారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 'ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్' అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆరు వారాల పాటు ఈ ప్రచారం కొనసాగనుంది. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, పేద-ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలకు బలవుతున్నారని, అత్యాశ కారణంగానే చాలా మంది మోసగాళ్లకు చిక్కుతున్నారని పేర్కొన్నారు. సైబర్ ప్రమాదాలను నివారించాలంటే ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా గత ఏడాది సైబర్ నేరాలు పెరిగినప్పటికీ, తెలంగాణలో మాత్రం తగ్గుదల నమోదైందని శివధర్‌రెడ్డి తెలిపారు.