
Dharmasthala Mass Burial Case: ధర్మస్థల దర్యాప్తులో కీలక ముందడుగు.. బయటపడిన అవశేషాలు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన ధర్మస్థలలో చోటుచేసుకున్న అనుమానాస్పద మరణాలు ఇప్పటికీ మిస్టరీగానే కొనసాగుతున్నాయి. తాజాగా ఈ కేసులో దర్యాప్తుకు సంబంధించి ఒక కీలక పురోగతి నమోదైంది. శ్రీక్షేత్ర ధర్మస్థల సమీపంలోని అటవీ ప్రాంతాల్లో మృతదేహాలను పూడ్చినట్టు సమాచారం ఇచ్చిన ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ తవ్వకాల సందర్భంగా గురువారం ఒక ప్రదేశంలో మానవ అవశేషాలు బయటపడ్డాయి. ఇవి ఇప్పటివరకు ఈ కేసులో లభ్యమైన మొదటి స్పష్టమైన ఆధారంగా నమోదవుతుండడం గమనార్హం.
వివరాలు
13ప్రదేశాల్లో మృతదేహాలు
ఈ సంఘటనలపై గతంలోనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో,ఆరోపణల ప్రామాణికతను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. సోమవారం నుంచి సిట్ అధికారులు ఆరో కార్మికుడిని తమతో తీసుకెళ్లి విచారణ చేపట్టారు. దక్షిణ కన్నడ జిల్లాలోని నేత్రావతి నది స్నానఘట్టానికి అవతలనున్న ప్రాంతాన్ని విచారణకు ఎంచుకుని పరిశోధన మొదలుపెట్టారు. సంబంధిత వ్యక్తి మొత్తం 13ప్రదేశాల్లో మృతదేహాలను పూడ్చినట్లు చెప్పడంతో,ఆ ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. గురువారం ఆరో ప్రదేశంలో తవ్వకాలు చేసినప్పుడు మానవ అవశేషాలు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి,మరింత విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపించబడినట్లు సమాచారం. ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాత అవి ఎవరివో,ఎంత కాలానికి సంబంధించినవో స్పష్టత వస్తుందని సిట్ అధికారులు తెలిపారు.
వివరాలు
వివాదాస్పద కేసు నేపథ్యం ఏమిటి?
ధర్మస్థల శైవ ఆధ్యాత్మిక క్షేత్రంగా కేవలం కర్ణాటక నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విరివిగా తరలివస్తుంటారు. ఇక్కడ గతంలో పనిచేసిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల సంచలన విషయాలు వెలికితీశాడు. 1998 నుంచి 2014 వరకు తాను పనిచేసిన సమయంలో అనేక మంది యువతులు, మహిళలు అదృశ్యమయ్యారని, వారు హత్యకు గురైయ్యారని, ఆ మృతదేహాలను తానే పూడ్చినట్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అతని వాదన ప్రకారం, వీరంతా అనుమానాస్పదంగా అదృశ్యమైన వారు మాత్రమే కాక, లైంగిక దాడులకు గురై హత్యకు గురైనవారు కావచ్చన్న అనుమానాలు వెలువడుతున్నాయి. ఈ ఆరోపణలు వెలువడిన వెంటనే మొత్తం వ్యవహారం సంచలనంగా మారింది.
వివరాలు
వివాదాస్పద కేసు నేపథ్యం ఏమిటి?
ఆ వ్యక్తి మాటల ప్రకారం, 2014 డిసెంబరులో తన కుటుంబంలోని ఓ యువతిపై కొందరు లైంగికంగా వేధింపులు చేయడంతో వారు ఇంటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇక మృతదేహాలను ఎవరు పూడ్చించమన్నారు? అతడికి సహాయం చేసినవారు ఎవరు? మృతదేహాలను ఏ రీతిలో, ఎలా అక్కడికి తీసుకెళ్లారు? అనే అంశాలపై సిట్ అధికారులు ఇప్పటికే విచారణ చేపట్టారు. అతడి నుంచి సమగ్ర వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు మరింత లోతుగా దర్యాప్తు అవుతోంది.