Digital Arrests: దేశాన్ని వణికిస్తున్న డిజిటల్ అరెస్టులు.. రూ.3వేల కోట్లు నష్టం : సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న 'డిజిటల్ అరెస్టు' (Digital Arrests) మోసాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మోసాలకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్టు స్కామ్‌లపై సుప్రీంకోర్టులో నిరంతర విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు తీవ్రంగా స్పందించారు. మన దేశంలోనే ఈ మోసాల వల్ల సుమారు రూ.3వేల కోట్లు దోచుకుపోయారు. ఇది అత్యంత ఆందోళనకరం. ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే, ఈ నేరగాళ్లు మరింతగా పెరుగుతారు. వీటిని అరికట్టేందుకు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. అదే సమయంలో సుప్రీంకోర్టు మరో ముఖ్యాంశాన్ని కూడా ప్రస్తావించింది. ''డిజిటల్ అరెస్ట్ సమస్య ఇప్పుడు ఒక పెద్ద సవాల్‌గా మారింది.
Details
సమగ్ర నివేదిక సమర్పించాలి
ఇతర దేశాల్లో ఈ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. కానీ మన దేశంలో సాంకేతిక, ఆర్థిక విభాగాలు మరింత సమర్థవంతంగా పనిచేయేలా చర్యలు అవసరమని పేర్కొంది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానానికి వివరాలు సమర్పించారు. ఇలాంటి స్కామ్‌లలో బాధితులు ఎక్కువగా వయోధికులు కావడం అత్యంత విచారకరమని తెలిపారు. అలాగే, ఈ కేసుల్లో ఫిర్యాదులపై దర్యాప్తు జరపడానికి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక యూనిట్ పనిచేస్తోందని వెల్లడించారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించేందుకు కొంత సమయం కావాలని ఆయన అభ్యర్థించారు.
Details
సీబీఐకి అప్పగించే ప్రయత్నం
ఇక దేశవ్యాప్తంగా విస్తృతంగా చోటుచేసుకుంటున్న ఈ మోసాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించే అవకాశాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. గత విచారణలోనే ఈ అంశంపై సీబీఐ సాంకేతిక, సిబ్బందిపరమైన వనరులు సరిపోతాయా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై తుషార్ మెహతా సమాధానమిస్తూ— ఇప్పటికే సీబీఐ ఈ తరహా సైబర్ మోసాలపై దర్యాప్తు చేస్తోందని, కేంద్ర హోంశాఖ సైబర్ క్రైమ్ విభాగం నుంచి అవసరమైన సాంకేతిక సహాయం అందుతున్నదని తెలిపారు.