Page Loader
Digital India: డిజిటల్ ఇండియాకు పది సంవత్సరాలు.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్
డిజిటల్ ఇండియాకు పది సంవత్సరాలు.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్

Digital India: డిజిటల్ ఇండియాకు పది సంవత్సరాలు.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2025
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై నేటికి పదేళ్లు పూర్తయ్యాయి. 2015 జూలై 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశాన్ని డిజిటల్ శక్తిగా మార్చే దిశగా, సాంకేతికత ద్వారా పౌరులకు ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఈ పథకం తీసుకొచ్చారు. అలాగే, డిజిటల్ అసమానతలను తగ్గించడమే కాక, సామాన్యులకు మరింత అనుసంధానాన్ని అందించాలన్నది ఈ కార్యక్రమం మౌలిక ఉద్దేశం. గడిచిన దశాబ్దంలో డిజిటల్ ఇండియా అనూహ్యంగా విజయవంతమైంది. ఇది ఊహించినదానికంటే ఎంతో ప్రాముఖ్యమైన మార్పులను దేశంలో తీసుకొచ్చింది. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ సేవల విస్తరణ ద్వారా సమాజంలో స్పష్టమైన మార్పులు కనిపించాయి.

వివరాలు 

140 కోట్ల మంది భారతీయుల సంకల్పబలంతో..

డిజిటల్ ఇండియా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ సోషియల్ మీడియా వేదిక ఎక్స్ లో ఆసక్తికరంగా స్పందించారు. "ఈ రోజు చారిత్రాత్మకమైనది. పదేళ్ల క్రితం, మన దేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చెందిన, డిజిటల్‌గా సాధికారత పొందిన సమాజంగా తీర్చిదిద్దే లక్ష్యంతో డిజిటల్ ఇండియా ప్రారంభించాం. ఇప్పుడు, పదేళ్ల అనంతరం, ఈ ఉద్యమం లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితం చేసింది. ఇది సాధికారతకు ఒక కొత్త శకానికి నాంది పలికింది. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పబలంతో, భారత్ డిజిటల్ చెల్లింపుల్లో అపూర్వమైన పురోగతిని సాధించింది. ఆరోగ్యం, విద్య వంటి కీలక రంగాలు కూడా ఈ ఉద్యమం ద్వారా విశేష ప్రయోజనాలను పొందాయి" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్