
MadhyaPradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పికప్ వాహనం బోల్తా పడి 14 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో పికప్ వాహనం బోల్తా పడిన ఘటనలో కనీసం 14 మంది మరణించగా, 21 మంది గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని షాహపురా పోలీస్ స్టేషన్ పరిధిలో బాధిత ప్రజలు 'గోద్ భరై' కార్యక్రమం నుండి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది.
ఈ సంఘటన తర్వాత,పోలీసులు,ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్చారు.
గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు, మృతులను పోస్ట్‌మార్టం కోసం పంపారు.
Details
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం
ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
క్షతగాత్రులకు వైద్యసేవలు అందించాలని స్థానిక అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అంతేకాకుండా, సహాయక చర్యలను సమీక్షించడానికి దిండోరీకి వెళ్లాల్సిందిగా క్యాబినెట్ మంత్రి సంపతీయ ఉయికేని కూడా ఆయన ఆదేశించారు.