Page Loader
Sarita Boudhauria: రైలు ప్రారంభోత్సవంలో అపశృతి.. పట్టాలపై పడిపోయిన బీజేపీ మహిళ ఎమ్మెల్యే
రైలు ప్రారంభోత్సవంలో అపశృతి.. పట్టాలపై పడిపోయిన బీజేపీ మహిళ ఎమ్మెల్యే

Sarita Boudhauria: రైలు ప్రారంభోత్సవంలో అపశృతి.. పట్టాలపై పడిపోయిన బీజేపీ మహిళ ఎమ్మెల్యే

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2024
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్‌గా కొత్తగా ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైళ్లలో విశాఖ-దుర్గ్, సికింద్రాబాద్-నాగ్‌పూర్, ఆగ్రా-వారణాసి రైళ్లు కూడా ఉన్నాయి. అయితే, ఆగ్రా-వారణాసి వందే భారత్ రైలు ప్రారంభోత్సవం సమయంలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కి చెందిన బీజేపీ మహిళా ఎమ్మెల్యే సరిత భౌదౌరియా, ఎటవా రైల్వే స్టేషన్‌లో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హజరయ్యారు. రైలు పచ్చజెండా ఊపుతున్న సమయంలో అనుకోకుండా ఆమె ట్రాక్‌పై పడిపోయారు. దీంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

Details

ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న సరిత భౌదౌరియా

పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై, ఆమెను పైకి లాగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆగ్రాలో రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టూ రైలును ప్రారంభించిన అనంతరం, రైలు ఎటవా స్టేషన్‌కు చేరుకోగానే పలువురు అధికారులు, నేతలు జెండా ఊపి రైలును ప్రారంభించడానికి ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి కొంతమంది తోసేయడంతో ఎమ్మెల్యే పట్టాలపై పడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే సరిత భౌదౌరియాకు ఎటువంటి గాయాలు కాలేదని, వైద్యుల సూచన మేరకు ఇంటి వద్దే ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారని బీజేపీ నేత సంజీవ్ భౌదౌరియా చెప్పారు.

Embed

ప్రమాదం నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యే

Etawah, UP: The flag-off ceremony for the Agra-Varanasi Vande Bharat Express faced chaos due to heavy rush, and BJP's Etawah Sadar MLA, Sarita Bhadoria, fell in front of the train pic.twitter.com/p10CfbDIF0— IANS (@ians_india) September 16, 2024