Page Loader
కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై డీకే శివకుమార్ భావోద్వేగం
కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై డీకే శివకుమార్ భావోద్వేగం

కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై డీకే శివకుమార్ భావోద్వేగం

వ్రాసిన వారు Stalin
May 13, 2023
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ శనివారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన డీకే శివకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడంతో 50రోజుల పాటు తీహార్ జైలులో ఉన్నానని, ఆ సమయంలో తనను కలవడానికి వచ్చిన సోనియా గాంధీని చూసి కన్నీటి పర్యంతమైనట్లు శివకుమార్ గుర్తు చేసుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తానని ఆనాడు సోనియా గాంధీకి హామీ ఇచ్చినట్లు గుర్తు చేసారు.

కాంగ్రెస్

ఇది పార్టీ కార్యకర్తలు, నాయకుల విజయం: శివకుమార్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం నేపథ్యంలో నాయకులందరికీ శివకుమార్ ధన్యవాదాలు తెలిపారు. అందరూ కష్టపడి పనిచేసిట్లు గుర్తు చేశారు. ప్రజలు తమపై విశ్వాసం ఉంచారని పేర్కొన్నారు. అయితే ఈ విజయం పార్టీ కార్యకర్తలు, నాయకుల విజయమని శివకుమార్ చెప్పారు. బీజేపీ తనను జైల్లో పెట్టిన తర్వాత సోనియాగాంధీ తీహార్ జైలులో తనను పరామర్శించడం ఎప్పటికీ మర్చిపోలేనని శివకుమార్ గుర్తు చేసుకున్నారు. కర్ణాటకకు అండగా ఉంటానని గాంధీ కుటుంబానికి, ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు చెప్పానని శివకుమార్ అన్నారు. కాంగ్రెస్ కార్యాలయమే తమ దేవాలయమని, అందులోనే తమ భవిష్యత్ కార్యచరణను నిర్ణయిస్తామని శివకుమార్ అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భావోద్వేగానికి గురైన శివకుమార్